వారివి పగటి కలలు.. ఏపీలో వాళ్ల దుకాణం బంద్: యామిని

Update: 2019-04-21 07:15 GMT

ఏపీలో ముగిసిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం ప్రతిఒక్కరు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కాగా ఇప్పటికే ఆయా పార్టీ అధినేతలు గెలుపు ధీమాపై ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో మళ్లీ తిగిరి తెలుగుదేశం పార్టీ రావడం ఖాయమని, ఏపీలో భారీ మెజారీటితో టీడీపీ జెండా రేపరేపలాడుతుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి సాధినేని యామిని అన్నారు. ఏప్రిల్ 11నే ఏపీ ద్రోహుల కాంట్రాక్ట్ ముగిసిపోయిందని.. ఎన్ని కుట్రలు చేసినా.. ప్రజలు టీడీపీకి అండగా నిలబడ్డారన్నారు. పసుపు-కుంకమ పథకంతో ఏపీలో ఉన్న ఆడబిడ్డలంతా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి పూర్తి మద్దతిచ్చారని చెప్పారు. శనివారం టీడీపీ కార్యాలయంలో మాట్లాడిన యామిని.

కాగా వైసీపీ, బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలు ఏపీలో ఎన్నికల ఫలితాలు రాకముందే వైసీపీ నేతలు గెలిచినట్లు, అధికారంలోకి వచ్చేసినట్లు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కేబినెట్ పోర్ట్‌ఫోలియాలు పంచుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ దుకాణం కాదు వైసీపీ, బొత్స సత్యనారాయణ దుకాణం బందయ్యిందంటూ సెటైర్లు పేల్చారు. నరేంద్ర మోదీ, జగన్‌తో కలిసి రాష్ట్రంపై కుట్రలు చేశారని.. అధికారంలోకి రావడానికి అడ్డదారులు తొక్కే సంస్కృతి టీడీపీకి లేదన్నారు.  

Similar News