జగన్‌ ప్రకటించింది బీసీ డిక్లరేషన్ కాదు...: పంచుమర్తి అనురాధ

Update: 2019-02-18 08:53 GMT

జగన్‌ ప్రకటించింది బీసీ డిక్లరేషన్ కాదని...బీసీల గొంతు కోసే డిక్లరేషన్ అని విమర్శించారు టీడీపీ నేత పంచుమర్తి అనురాధ. బీసీ సబ్ ప్లాన్‌కు తమ ప్రభుత్వం చట్టబద్ధత కల్పించిందన్నారు. టీటీడీ ఛైర్మన్ పదవి బీసీలకు ఇచ్చామని, బీసీల సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం 33వేల కోట్లు ఖర్చు చేసిందని చెప్పుకొచ్చారు. వైఎస్ హయాంలో ఆదరణ పథకాన్ని రద్దు చేశారని మండిపడ్డారు. బీసీలకు 3వేల కోట్లు కేటాయించి ఖర్చు కూడా చేయలేదన్నారు. ఆర్. కృష్ణయ్య ఏపీకి వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కుదరదని మండిపడ్డారు. టీడీపీలో 31 మంది బీసీ ఎమ్మెల్యేలు, 8 మంది మంత్రులు ఉన్నారని తెలిపారు. 50 శాతం బీసీలు తెలుగుదేశం పార్టీతో ఉన్నారని పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు.

Similar News