'వర్మా.. దమ్ముంటే ఆ హత్యపై సినిమా తీయండి: దివ్యవాణి

Update: 2019-05-01 05:52 GMT

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ప్రజాసమస్యలు ఉన్నటీకి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాటీపై స్పందిచారు కానీ మొన్నటి విజయవాడ లో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అడ్డుకున్నందుకు వైఎస్ జగన్ మద్దతు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ నాయకురాలు, సినీనటి దివ్యవాణి అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో నిన్న దివ్వవాణి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపీలో ఫొని తుపాను, నీటి సమస్యలు తెలంగాణలో ఇంటర్‌ విద్యార్థుల బలిదానలపై స్పందించకుండా ఒక సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకు మద్దతుగా జగన్‌ ట్విటర్‌లో పేర్కొన్న వ్యాఖ్యలు గర్హనీయమన్నారు దివ్యవాణి. కాగా రాంగోపాల్ వర్మకు దమ్ముంటే వైఎస్ కుటుంబంలో జరిగిన హత్యపై సినిమా తీయాలని రాంగోపాల్ వర్మకి దివ్వవాణి సవాల్‌ విసిరారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి చేతుల్లో రాంగోపాల్ వర్మ కీలుబొమ్మ లాగా ఉన్నరని ఆరోపించారు. 

Similar News