రాత్రి 9గంటలకు కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం

తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షనేత ఎవరనేది నేటితో తెర పడనుంది. కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం నేటి రాత్రి9గంటలకు కోర్ కమిటీ సమావేశం కానుంది.

Update: 2019-01-16 13:12 GMT

తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షనేత ఎవరనేది నేటితో తెర పడనుంది. కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం నేటి రాత్రి9గంటలకు కోర్ కమిటీ సమావేశం కానుంది. ఏఐసిసి ప్రదాన కార్యదర్శి కేఎస్ వేణుగోపాల్ సిఎల్పీ నేత ఎంపిక కోసం వస్తుండడంతో పార్టీ ఎమ్మెల్యేలు సీఎల్పీ నేత ఎంపిక కోసం పైరవీలు చేసుకుంటున్నారు. ఎవరికి సీఎల్పీ పదవి కట్టబెడుతారనేది పార్టీలో ఉత్కంఠంగా మారింది. కాగా అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నేటికి సీఎల్పీ బైటీ జరగలేదు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో కూటమితో పొత్తుపెట్టుకున్న కాని చివరికి 19 స్థానాలను కైవసం చేసుకుంది. రేపటి నుండి 20 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని నిర్ణయించడంతో కాంగ్రెస్ లో సీఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు. అయితే ఇప్పటికే సీఎల్పీ నేత రేస్‌లో ఉత్తంకుమార్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ పేర్లు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే రెండోసారి టి ఆర్ ఎస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పటికే సీఎంగా కేసీఆర్ రెండోసారి ప్రమాణ స్వీకారం కూడా చేసారు. 19 మందిలో ముగ్గురు సీనియర్ నేతలు సీఎల్పీ పదవికోసం అధిష్టానం వద్ద పైరవీలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చూడాలి మరీ సీఎల్పీ పదవి ఎవరిని వరిస్తుందో.

Similar News