టెన్త్ మ్యాథ్స్ పేపర్లో తప్పులు...ఆరు మార్కులు కలపనున్న విద్యాశాఖ

Update: 2019-04-16 11:40 GMT

తెలంగాణలో పదో తరగతి విద్యార్ధులకు ఆరు మార్కులు కలపాలని విద్యాశాఖ నిర్ణయించింది. గతనెలలో జరిగిన పదో తరగతి గణితం పరీక్షల్లో దొర్లిన తప్పుడు ప్రశ్నలకు విద్యార్ధులకు న్యాయం చేయాలని నిర్ణయించారు. పరీక్షల సమయంలో ప్రశ్నాపత్రంలో వచ్చిన తప్పులపై అన్యాయం జరుగుతుందని విద్యార్ధులు ఆందోళన వ్యక్తం చేశారు. స్పందించిన విద్యాశాఖ గణితం మొదటి పేపర్లో ఐదున్నర మార్కులు, రెండో పేపర్లో అర మార్కు కలుపుతున్నట్లు ప్రకటించింది. తప్పుగా ఉన్న ప్రశ్నలకు జవాబు రాసేందుకు యత్నించి విద్యార్ధులకు మాత్రమే ఆరు మార్కులు కలుపుతున్నట్లు విద్యాశాఖ నిర్ణయించింది. విద్యార్ధులకు నష్టం వాటిల్లకుండా ఉండాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. మార్చి 16న మొదలైన పరీక్షలు ఏప్రిల్ 2 వరకు కొనసాగాయి. కాగా మార్చి 23, 25న మ్యాథమేటిక్స్ పేపర్ 1, 2 పరీక్షలు నిర్వహించబడ్డాయి. పరీక్షలకు మొత్తం 5,38,867మంది విద్యార్థులు హాజరయ్యారు. 

Similar News