తిరుమలలో బయటపడ్డ భద్రతా వైఫల్యం

తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా విజిలెన్స్ సిబ్బంది పనితీరు తయారైంది. శ్రీవారి ఆలయానికి కూతవేటు దూరంలో ఓ అత్యవసర మార్గంలోకి ముగ్గురు అక్రమంగా చొరబడటం కలకలం రేపింది.

Update: 2019-01-19 11:32 GMT

తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా విజిలెన్స్ సిబ్బంది పనితీరు తయారైంది. శ్రీవారి ఆలయానికి కూతవేటు దూరంలో ఓ అత్యవసర మార్గంలోకి ముగ్గురు అక్రమంగా చొరబడటం కలకలం రేపింది. ప్రధాన ఆలయానికి అతి సమీపంలోని తిరుమల నంబి సన్నిధి వద్ద ఉన్న అత్యవసర ప్రవేశ మార్గం తాళాలను తమ వద్ద గల గది తాళాలతో తెరిచి అక్రమ దారిలో ముగ్గురు యువకులు దర్శన క్యూలైన్లోకి ప్రవేశించారు. దీంతో మహా ద్వారం తనిఖీ కేంద్రం వద్ద ఆ ముగ్గురిని సిబ్బందిని అదుపులోకి విచారిస్తే అసలు విషయం బయటపడింది.

మహారాష్ట్రకు చెందిన 15 మంది యువకులు శ్రీవారి దర్శనార్థం కాలినడకన నిన్న తిరుమల వచ్చారు. అందులో 12 మందికి మాత్రమే దివ్యదర్శనం టోకెన్లు లభించాయి. మిగిలిన ముగ్గురు స్వామివారిని దర్శించుకువాలనే అతృతతో ఇలా అక్రమ దారిలో క్యూలోకి ప్రవేశించినట్టు విజిలెన్స్ విచారణలో తేలింది. కేసును తిరుమల ఒన్‌టౌన్ పోలీసులకు విజిలెన్స్ అధికారులు అప్పగించారు. అయితే, ఏదో ఒక విధంగా స్వామివారిని దర్శించుకోవడానికి అక్రమ దారిలో క్యూలోకి చొరబడినట్టు పట్టుబడిన యువకులు చెబుతున్నారు. ఈ ఘటనపై తిరుమల జేఈవో శ్రీనివాసరాజు భద్రతా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో అమలవుతున్న ట్రెడిషినల్ డ్రెస్ కోడే ఈ ముగ్గురినీ పట్టించిందని ఆయన తెలిపారు. దొంగ తాళాలతో యువకులు గేటు తెరిచి దర్శన క్యూలోకి ప్రవేశించడం దురదృష్టకరమని, ఇది పూర్తిగా భద్రతా వైఫల్యంగా పరిగణిస్తున్నామని జేఈవో చెప్పారు. సంబంధిత భద్రతా సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.  

Full View

Similar News