రాజ్యసభ రేపటికి పొడిగింపు

రాజ్యసభలో ఇవాళ ఆందోళనల పర్వం కొనసాగింది. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌పై సీబీఐ దర్యాప్తును వ్యతిరేకిస్తూ ఆ పార్టీ ఎంపీలు నిరసన చేపట్టారు.

Update: 2019-01-08 16:00 GMT

రాజ్యసభలో ఇవాళ ఆందోళనల పర్వం కొనసాగింది. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌పై సీబీఐ దర్యాప్తును వ్యతిరేకిస్తూ ఆ పార్టీ ఎంపీలు నిరసన చేపట్టారు. వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్పీ, బీఎస్పీ ఎంపీల ఆందోళనకు కాంగ్రెస్‌ సభ్యులు కూడా మద్దతిచ్చారు. విపక్షాల ఆందోళనలతో శీతాకాల సమావేశాల్లో చివరి రోజైన ఇవాళ సభ పలుమార్లు వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు నేటితో ముగియాల్సి ఉంది. అయితే పలు అంశాలపై చర్చలు పెండింగ్‌లో ఉండటంతో రాజ్యసభ పని దినాన్ని రేపటికి పొడిగించారు.

రాజ్యసభను రేపటికి పొడిగించడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. తమ సమ్మతి లేకుండానే ప్రభుత్వం రాజ్యసభను ఒక రోజు పొడిగించారని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ సహా విపక్ష పార్టీల సభ్యులు పార్లమెంట్‌ ఆవరణలో ఆందోళనకు దిగాయి. పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద విపక్షాలు ధర్నా నిర్వహించాయి. ప్రభుత్వం అకస్మాత్తుగా కొత్త బిల్లులను సభ ముందకు తెచ్చిందని మండిపడ్డారు. 

Similar News