మహిళలకు 33% రిజర్వేషన్...రాహుల్ గాంధీ సంచలన హామీ

Update: 2019-03-14 02:37 GMT

లోక్‌సభ ఎన్నికల వేళ ఓటర్లపై హామీల వర్షం కురుస్తోంది. మహిళలను తమవైపు తిప్పుకునేందు అన్ని పార్టీలు పోటీపడుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు సైతం మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు కీలక హామీలు ప్రకటించారు.

వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే పార్లమెంట్, అసెంబ్లీల్లో స్త్రీలకు 33శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ మహిళలకు 33శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించి సంచలనం సృష్టించారు. చెన్నైలోని ఓ మహిళా కాలేజీలో విద్యార్థినులను ఉద్దేశించి ప్రసంగించిన రాహుల్ గాంధీ ఈ హామీ ఇచ్చారు.

కాంగ్రెస్‌తో పాటు తృణమూల్ కాంగ్రెస్, బిజూ జనతాదళ్ వంటి పార్టీలు సైతం మహిళా ఓటర్లపై ప్రత్యేకంగా ఫోకస్ చేశాయి. TMC లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాలో 41 శాతం మంది మహిళలకు టికెట్లు కట్టబెట్టారు మమతా బెనర్జీ. అటు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సైతం 33శాతం లోక్‌సభ సీట్లను మహిళలకే కేటాయించారు.

Similar News