2వేల నోటు ముద్రణ ఆపేసిన ఆర్‌బీఐ!

పెద్ద నోట్ల రద్దు తర్వాత కేంద్రం ప్రవేశపెట్టిన రూ. 2 వేల నోటును ఉపసంహరించుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా హల్‌చల్ చేస్తున్న వార్తలకు కేంద్రం మరింత బలం చేకూర్చింది.

Update: 2019-01-04 04:36 GMT

పెద్ద నోట్ల రద్దు తర్వాత కేంద్రం ప్రవేశపెట్టిన రూ. 2 వేల నోటును ఉపసంహరించుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా హల్‌చల్ చేస్తున్న వార్తలకు కేంద్రం మరింత బలం చేకూర్చింది. రూ.2 వేల నోట్ల వల్ల మనీలాండరింగ్ కేసులు పెరుగుతున్నట్టు గ్రహించిన కేంద్రం నోట్ల ముద్రణను నిలిపివేయాల్సిందిగా భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)ను ఆదేశించినట్టు తెలుస్తోంది. 2016 నవంబరులో చివర్లో ఈ నోట్లను ప్రభుత్వం చలామణిలోకి తీసుకొచ్చింది. సరిగ్గా రెండేళ్ల తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది.

ముద్రణను నిలిపివేసినా నోట్లు చలామణిలోనే ఉంటాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. రూ.2 వేల నోట్లను వెనక్కి తీసుకోబోతున్నట్టు వస్తున్న వార్తలను ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ఖండించింది. అటువంటిదేమీ లేదంటూ లోక్‌సభలో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పలుమార్లు స్పష్టం చేశారు. అయితే, తాజాగా వాటి ముద్రణను నిలిపివేస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. నోట్ల ముద్రణను నిలిపిస్తున్నట్టు తెలిపిన ఆర్బీఐ నోట్లు మాత్రం చలామణిలోనే ఉంటాయని, ఈ విషయంలో అనవసర భయాందోళనలు అవసరం లేదని స్పష్టం చేసింది.

Similar News