బ్రేకింగ్‌: వర్మను అడ్డుకున్న పోలీసులు

Update: 2019-04-28 07:58 GMT

ఏపీలో ఎట్టకేలకు తన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించడానికి సిద్ధమైన వర్మను పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్‌ నుంచి గన్నవరం విమానాశ్రయానికి ఆయన చేరుకోగానే లక్ష్మీస్ ఎన్టీఆర్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మను విజయవాడ పోలీసులు అడ్డుకున్నారు. ప్రకాష్ నగర్ లో సెంటర్ లో ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ పై మీడియా సమావేశం నిర్వహించి తీరుతానన్న ఆర్జీవీని హైదరబాద్ తిరిగి వెళ్లిపోవాల్సిందిగా పోలీసులు సూచించారు. ఈ ప్రెస్ మీట్ కు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. పోలీస్ ఎస్కార్ట్ తో గన్నవరం ఎయిర్ పోర్ట్ కి దర్శకుడు ఆర్జీవీ, నిర్మాత రాకేష్ రెడ్డిలను బలవంతంగా తిరిగి పంపించారు. వర్మ ప్రెస్‌మీట్‌తో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని పేర్కొంటూ ఆయనను తిగిగి వెళ్లాల్సిందిగా పోలీసులు ఒత్తిడి తెస్తున్నారు.



 


Similar News