23 భాషల్లో 'పీఎం నరేంద్ర మోదీ' ఫస్ట్‌ లుక్‌

భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితాధారంగా బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న బయోపిక్‌కు 'పీఎం నరేంద్రమోదీ' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

Update: 2019-01-07 16:21 GMT

భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితాధారంగా బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న బయోపిక్‌కు 'పీఎం నరేంద్రమోదీ' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో రీల్‌ లైఫ్‌ మోదీ పాత్రలో బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఒమంగ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఈరోజు విడుదల చేశారు. లుక్‌లో వివేక్‌ మోదీ గెటప్‌లో, ఆయన మేనరిజంతో ఆకట్టుకుంటున్నారు.

15 నుంచి సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషలతో కలిపి దాదాపు 23 భాషల్లో విడుదల చేయనున్నారు. 23 భాషల్లో డిజైన్‌ చేసిన పోస్టర్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ విడుదల చేశారు. వివేక్‌ తండ్రి సురేశ్‌ ఒబెరాయ్‌, సందీప్‌ సింగ్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పోస్టర్‌పై 'దేశ భక్తే నా శక్తి' అన్న క్యాప్షన్‌ ఆసక్తికరంగా ఉంది. బయోపిక్‌కు సంబంధించిన పూర్తి వివరాలను చిత్రబృందం త్వరలో ప్రకటించనుంది.

Similar News