పవన్ కళ్యాణ్ వర్సెస్ లోకేశ్... ఒకే జిల్లా నుంచి పోటీ ?

Update: 2019-03-12 11:09 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ ఇద్దరూ విశాఖపట్నంలోని నియోజకవర్గాలు అందులోనూ విశాఖ లోక్‌సభ పరిధిలోకి వచ్చే నియోజకవర్గాల్లో పోటీ చేయనుండటం దాదాపుగా ఖాయమైంది.ఇక దీంతో విశాఖ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో టీడీపీ వర్సెస్ జనసేన మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉందని జిల్లా రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ ఇద్దరు వారి పార్టీల్లో కీలక నేతలు. ఒకరు పార్టీ అధినేత కాగా, మరొకరు అధికార పార్టీ అధినేత కుమారుడితో పాటు రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఆ ఇద్దరు ఒకే రకమైన సమస్యను ఎదుర్కొంటున్నారు.పవన్‌ పోటీపై జనసేనలో క్లారిటీ వచ్చింది. ప్రధానంగా రెండు అసెంబ్లీ నియోకవర్గాలపై పవన్‌‌ గురి పెట్టినట్టు తెలుస్తోంది. విశాఖ జిల్లా గాజువాక, తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రజాపోరు యాత్ర సమయంలో పవన్‌ ప్రకటించారు. నారా లోకేష్‌ ఈసారి అసెంబ్లీ బరిలోకి దిగుతున్నారు. ఎమ్మెల్సీగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన లోకేష్‌ ఆ తర్వాత మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే, ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. విశాఖ నార్త్‌ నుంచి నారా లోకేష్‌ను బరిలోకి దింపాలని చంద్రబాబు నిర్ణయించారు. భీమిలి లేదా విశాఖ నార్త్‌ నియోజకవర్గం నుంచి లోకేశ్‌ పోటీ చేస్తారని మొదట ప్రచారం జరిగింది. అయితే, విశాఖ నార్త్‌ టిక్కెట్‌ ఆశిస్తున్న పలువురు నేతలు పార్టీ అధినేతను కలవగా లోకేశ్‌ పోటీ చేస్తున్నారని, ఆయనకు సహకరించాలని సూచించినట్టు తెలిసింది. దాంతో ఆ స్థానంపై కూడా సందిగ్ధత తొలగిపోయింది. మొత్తానికి ఒకే ఎంపీ నియోజకవర్గం పరిధిలోని నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్, లోకేశ్‌ కారణంగా వారి పార్టీలకు ఎంతమేరకు మేలు కలుగుతుందన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. మరీ ఎన్నికల రణరంగంలో విజేతలేవరో? పరజీతులేవరో మరి కొద్ది రోజుల్లో తెలనుంది.  

Similar News