పాకిస్థాన్ ఆదరగోట్టింది .. కివీస్ కి తప్పని ఓటమి ..

Update: 2019-06-27 01:25 GMT

  • భారత్ తో ఓటమి తరవాత పుంజుకున్న పాకిస్థాన్..
  • వరుసగా రెండో విజయం ..
  • న్యూజిలాండ్ జట్టుపై ఆరు వికెట్ల తేడాతో విజయం ..
  • సెంచరీతో మెరిపించిన బాబర్‌ అజామ్‌..
  • టోర్నిలో తొలి ఓటమిని చూసిన న్యూజిలాండ్ ...

భారత్ తో మ్యాచ్ ఓడిపోయాక పాకిస్థాన్ మంచి ప్రదర్శనను కనబరుస్తుంది .. అ జట్టు భారత్ తో ఓటమి తర్వాత వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది .. నిన్న న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది .. అ జట్టులో అజామ్ అద్బుతమైన బ్యాటింగ్ తో పాకిస్థాన్ కి విజయాన్ని కట్టబెట్టాడు ..

మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ జట్టు నిర్ణిత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 237 పరుగులు చేయగలిగింది .. నీషమ్‌ (97 నాటౌట్‌; 112 బంతుల్లో 5×4, 3×6), గ్రాండ్‌హోమ్‌ (64; 71 బంతుల్లో 6×4, 1×6) గొప్పగా ఆడడంతో న్యూజిలాండ్ గౌవరప్రదమైన స్కోర్ ని చేయగలిగింది .. 83 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న కివీస్ జట్టును వీరిద్దరూ 132 పరుగులు జోడించి అ జట్టుకు మంచి స్కోర్ ని అందించారు .. వీరు తప్ప న్యూజిలాండ్ జట్టులో ఆశించిన స్థాయిలో ఎవరు ఆడలేకపోయారు ..

ఇక లక్ష్య చేధనకి దిగిన పాకిస్థాన్ జట్టుకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది .. అ జట్టు ఓపెనర్ బాట్స్ మెన్ అయిన ఫకర్‌ జమాన్‌ (9) రూపంలో పాకిస్థాన్ మొదటి వికెట్ ని కోల్పోయింది . అ తర్వాత హక్ (19) వెనువెంటనే అవుట్ అవడంతో పాకిస్థాన్ జట్టు కొంచం ఒత్తిడిలో పడినట్టు అయింది . కానీ అ తర్వాత వచ్చిన బాబర్‌ అజామ్‌ అద్భుతమైన బ్యాటింగ్ తో జట్టును విజయతీరాలకు నడిపించాడు .. హఫీజ్‌ (32) తో కలిసి మూడో వికెట్‌కు 76 పరుగులు జోడించాడు .. టోర్నిలో ఐదు విజయాలను అందుకున్న న్యూజిలాండ్ కి తొలి ఓటమి ఇదే కావడం విశేషం ..  

Tags:    

Similar News