జగన్‌పై దాడి కేసులో ముగిసిన శ్రీనివాస్‌రావు ఎన్‌ఐఏ కస్టడీ...దాడి వెనుక...

వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్‌రావు ఎన్‌ఐఏ కస్టడీ ముగిసింది. దీంతో ఇవాళ అతన్ని విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. గత శనివారం శ్రీనివాస్‌ను తమ కస్టడీకి తీసుకున్న ఎన్‌ఐఏ అధికారులు వైజాగ్‌, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో విచారణ చేశారు.

Update: 2019-01-18 04:25 GMT
Srinivas Rao

వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్‌రావు ఎన్‌ఐఏ కస్టడీ ముగిసింది. దీంతో ఇవాళ అతన్ని విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. గత శనివారం శ్రీనివాస్‌ను తమ కస్టడీకి తీసుకున్న ఎన్‌ఐఏ అధికారులు వైజాగ్‌, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో విచారణ చేశారు. సానుభూతి కోసమే తాను ఈ దాడికి పాల్పడినట్లు ఘటన వెనుక ఎలాంటి కుట్ర లేదన్నట్లు శ్రీనివాస్‌ విచారణలో వెల్లడించినట్లు చెబుతున్నారు. ఇటు న్యాయవాది సమక్షంలో విచారించిన ఎన్‌ఐఏ అధికారులు మొత్తం ప్రక్రియను వీడియో తీశారు. ఇటు ఇవాళ కోర్టుకు కస్టడీ రిపోర్ట్‌ను కూడా సమర్పించనున్నారు.

మరోవైపు జగన్‌పై దాడి కేసు దర్యాప్తును ఎన్‌ఐయేకు అప్పగింతపై మొదటి నుంచీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఏపీ ప్రభుత్వం దీనిపై హైకోర్టును ఆశ్రయించనుంది. కేసును అత్యవసరంగా విచారణ జరపాలని హౌజ్‌మోషన్‌ పిటీషన్‌ వేయనుంది. అయితే హైకోర్టుకు సంక్రాంతి సెలవులున్న కారణంగా సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. అయితే అత్యవసర విచారణకు అనుమతిస్తే శనివారమే విచారణ జరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. దీనిపై ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు పిటీషన్‌ను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 

Similar News