ఆన్‌లైన్‌లో పరిచయం.. పిలిస్తే ఫ్లాట్‌కు వెళ్లింది.. చివరకు..

Update: 2019-06-02 06:35 GMT

ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తి తన ఉండే ప్లాట్‌కి రమ్మన్నాడని వెళ్లింది ఓ యువతి. అయితే తరువాత ఇద్దరి మధ్య పరస్పర వాగ్వాదం మొదలైంది. చివరకు ఆ వ్యక్తిని కత్తితో దాడికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం న్యూజెర్సీలోని నెవార్క్‌కు చెందిన జానియా పీ స్టీవెన్స్(23) అనే యువతికి ఆన్ లైన్ ఓ వ్యక్తి పరిచయం అయ్యాయి. మొళ్లిగా వారి పరిచయం అలా అలా సాగుతూ వచ్చింది. ఆ పరిచయం కాస్తా సదరు వ్యక్తి ఆ యువతిని తన ఫ్లాట్‌కి పిలిచాడు. దాంతో అతని మాట కోరకు ఫ్లాట్‌కి వెళ్లింది. తీరా ప్లాట్ కి వచ్చిన జానియా ఓ విషయమై అతడితో గొడవపడింది. మాటమాట పెరిగింది ఈ క్రమంలోనే అతన్ని కత్తితో మూడుసార్లు పొడిచి అక్కడి నుంచి వచ్చేసింది జానియా. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు జానియా పీ స్టీవెన్స్ విచారించారు. అయితే రూంకి వెళ్లిన తన గొంతు నులిమేందుకు యత్నించడంతో ఆత్మరక్షణ కోసం అతడిపై దాడిచేశనని చెప్పింది. ఆమె చెప్పిన మాట ప్రకారం తన గొంతుపై ఎలాంటి గుర్తులు లేకపోవడంతో దాంతో స్టీవెన్స్‌పై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి పోలీసుఠాణాలో పెట్టారు.

Similar News