యువకుడి అత్యుత్యాహం...సోషల్‌మీడియాలో లైక్‌ల కోసం...

Update: 2019-01-26 09:11 GMT

చేసే ముందు ఒక్క క్షణం కూడా ఆలోచించట్లేదు. ఎంత సేపు ఏదో ఒక అడ్వంచర్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పెడదామా అని చూస్తున్నారే కానీ దాని వలన జరగరానిది ఏదైనా జరిగితే ఏరుకోవడానికి ఎముకలు కూడా మిగలవనే విషయం అర్థం కావట్లేదు. ఇంతకీ అతడేం చేశాడో అర్థం కాలేదా అయితే ఈ స్టోరీ చూడండి.

సోషల్ మీడియాలో లైకులు, కామెంట్ల గురించి ఆలోచిస్తున్నారే కానీ అమ్మానాన్నల గురించి ఆలోచించట్లేదు నేటీ యువత. ముఖ్యంగా బంగారం లాంటి తమ భవిష్యత్తు గురించి అస్సలు ఆలోచించట్లేదు. తనతో పాటు మరో నలుగురికి ఉపయోగపడే మంచి పని చేయాలన్న ఆలోచలేదు. తమ పిచ్చిపనుతో కుటుంబసభ్యులకే కాదు చూసే వారికీ పిచ్చేక్కిస్తున్నారు.

వాషింగ్టన్‌కు చెందిన 27 ఏళ్ల నికోలాయ్ నేదేవ్ బహుమాస్ నాసౌలోని రాయల్ కరీబియన్ క్రూజ్ షిప్ ఎక్కాడు. అతడితో పాటు మరి కొంతమంది స్నేహితులు కూడా ఉన్నారు. అందరూ కలిసి క్రూజ్‌లోని 11వ అంతస్తుకు చేరుకున్నారు. పిచ్చాపాటి మాట్లాడుకుంటూ, సముద్రపు అందాలను అంతెత్తునుంచి వీక్షిస్తూ తమని తాము మరచి పోయి మరీ తెగ ఎంజాయ్‌ చేశారు.

అంతవరకు బాగానే ఉన్నా అంతలో మనోడి బుర్రలోకి ఓ ఆలోచన దూరింది. ఇక్కడి నుంచి దూకేస్తే అని నికోలాయ్ అన్నాడో లేదో స్నేహితులు మరెందుకు ఆలస్యం అంటూ అతన్ని ప్రోత్సహించారు. దూకేంత వరకు రెచ్చగొట్టారు. అంతే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అంతెత్తునుంచి సముద్రంలోకి దూకేశాడు. ఈ దృశ్యం మొత్తం స్నేహితులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వైరల్‌గా మారింది. అదృష్టం బావుండి అతగాడు బతికి బయటపడనుకోండి.

అయితే విషయం తెలుసుకున్న క్రూజ్ షిప్ అధికారులు నికోలాయ్‌పైన అతడి స్నేహితులపైనా ఫైరయ్యారు. ఇక లైఫ్‌లో తమ షిప్ ఎక్కవద్దంటూ వారిపై నిషేధం విధించారు. తాను చేసిన తప్పుకి వివరణ ఇచ్చుకున్న నికోలాయ్ అంతకు ముందు రోజు రాత్రి తాగిన మందు మత్తు ఇంకా దిగలేదని అందుకే 11 వ అంతస్తునుంచి దూకినట్లు చెబుతున్నాడు.

మనోడి తిక్క పనికి నెటిజన్లు సైతం ఫైరయ్యారు. సరదా పనులు ఎలాంటి చిక్కులు తీసుకువస్తోయో తెలుసుకోవాలంటున్నారు. ఇకనైనా డేంజరస్‌ ఫీట్లతో లైఫ్‌నే బేకారు చేసుకోవడం కన్నా బిందాస్‌గా సెటిల్‌ అయ్యే ఆలోచలు చేయమని సలహా ఇస్తున్నారు.

Full View

Similar News