లగడపాటి సర్వే లెక్కలో ఆ పార్టీయే అధికారంలోకి...

Update: 2019-05-19 13:17 GMT

తెలుగు ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏపీ ఎన్నికలపై మాజీ ఎంపీ, ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ ఎగ్జిట్స్ పోల్స్ వెల్లడించారు. తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఒక రోజు ముందుగానే సంకేతాలు ఇచ్చిన లగడపాటి.. ఎగ్జిట్ పోల్స్ సర్వేలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై అంచనాలు వెల్లడించారు. 175 అసెంబ్లీ స్థానాలున్న ఆంధ్రప్రదేశ్‌లోటీడీపీకి 90-110, వైసీపీకి 65-77 సీట్లు, జనసేన, ఇతరులకు మూడు సీట్లకు రెండు సీట్లు అటూఇటుగా వస్తాయని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. టీడీపీ మరోసారి స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి రానున్నట్టు లగడపాటి సర్వే అంచనా వేసింది. 

Similar News