కోహ్లీపై సచిన్ టెండూల్కర్ సంచలన వ్యాఖ్యలు

Update: 2019-05-22 14:48 GMT

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై సచిన్   సంచలన వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ కప్‌లో కోహ్లీ ఒంటరి పోరాటం వల్ల కప్ గెలవటం చాలా కష్టమని భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ స్సష్టం చేశారు. భారత జట్టులోని అందరి క్రికెటర్ల మద్దతుతోనే ప్రపంచ కప్ గెలవడం సాధ్యమవుతుందని మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన అభిప్రాయాన్ని సచిన్ వెల్లడించారు. ఇక బ్యాటింగ్ ఆర్డర్‌లో నాలుగో స్థానాన్ని పరిస్థితిని బట్టి భర్తీ చేస్తే సరిపోతుందని, దాన్ని పెద్ద సమస్యగా పరిగణించాల్సిన అవసరమే లేదన్నారు. భారత జట్టులో ప్రతిభ గల బ్యాట్స్‌మెన్స్ ఉన్నారని సచిన్ టెండూల్కర్ గుర్తు చేశాడు. ప్రపంచకప్ ని దృష్టిలో పెట్టుకొని కోహ్లీపై ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ నెల 30 నుంచి ఇంగ్లాడ్ వేదికగా ప్రపంచ కప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. బంగ్లాదేశ్ జట్లతో కోహ్లీసేన రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడుతుంది. అలాగే జూన్ 5వ తేదీన కోహ్లీటీం దక్షిణాఫ్రికా జట్టును ఢీకొట్టనుంది.

ఇదిలా ఉంటే నిన్న మీడియాతో కోహ్లీ మాట్లాడుతూ రాబోవు వరల్డ్‌కప్‌లో ఒత్తిడిని అధిగమించడం చాలా ముఖ్యమని భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్పష్టం చేశాడు. తమదైన రోజున ఏ జట్టునైనా ప్రత్యర్థి దెబ్బతీయగలదన్న కోహ్లి.. ప్రతీ మ్యాచ్‌కు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాల్సి ఉందన్నాడు.ఇప్పటి వరకూ తాను ఆడిన మూడు వరల్డ్ కప్‌లలో ఇదే అత్యంత చాలెంజింగ్ వరల్డ్ కప్ అని కోహ్లి తెలిపాడు. 

Similar News