అలా చేసిన ఏకైక సీఎం వైఎస్‌ జగన్‌ : కొడాలి నాని

Update: 2019-06-08 09:59 GMT

సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్. ఇన్నాళ్లు తన ఇంటి నుంచి పాలన బదిలీ వ్యవహారాలు చక్కదిద్దారు. సీఎంగా అధికారికంగా ఏపీ సచివాలయంలోకి అడుగుపెట్టారు.సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే తనదైనమార్క్‌ను చాటుకున్నారు సీఎం జగన్. పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ముచ్చటగా మూడు ఫైళ్లపై సంతకాలు చేసారు. ఏపీ సీఎం హోదాలో వైఎస్‌ జగన్‌ తనదైన స్టైల్‌లో దూసుకుపోతున్నారు. తన సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను అమలు పర్చేవిధంగా అడుగులు వేస్తున్నారు సీఎం జగన్. సామాజిక సమతూల్యత పాటిస్తూ బడుగు బలహీనవర్గాలకు పెద్దపీట వేస్తూ 25 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు.

అయితే ఏ సీఎం కూడా చేయని విధంగా మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రస్తావించిన నవరత్నాలకు సంబంధించిన వాల్‌ పెయింట్స్‌ను వైఎస్‌ జగన్‌ సచివాలయంలో పెట్టించారు. ఈ విషయాన్ని మంత్రి కొడాలి నాని తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. మ్యానిఫెస్టోను తూచ తప్పకుండ అమలు చేస్తానని చెప్తూ ఇలా సచివాలయంలో గోడల మీద వేయించిన ఏకైక సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. 



 











 


Tags:    

Similar News