లోటస్‌పాండ్‌ టు అమరావతి.. జగన్ వ్యూహం వెనక కారణమిదేనా?

Update: 2019-05-14 01:37 GMT

ఏపీ ఎన్నికల ఫలితాలకు సరిగ్గా తొమ్మిదిరోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే దేశం చూపు మొత్తం ఏపీ రాజకీయాలపైనే కన్నుపడింది. ఏపీ కింగ్ ఎవరు అనేది ఈనెల 23తేదీన తేలనుంది. మరోసారి ఏపీ పసుపు జెండా రేపరేపలాడుతుందా? లేక ఏపీలో ఫ్యాన్ గాలి వీస్తుందా అనేది 23న తేలనుంది. అయితే చాలా వరకు ఏపీలో వైసీపీ పార్టీ అధికార పగ్గాలు చేపడుతుందని సర్వేలో తేలింది. ఈ నేపథ్యంలో ఏపీలోకి పూర్తిగా షిఫ్ట్ అయ్యేందుకు జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకు ముహూర్తం కూడా ఖరారయిందని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌ నుంచి ఫర్నిచర్‌ను అమరావతికి తరలించారు. మే 22న మంచి ముహూర్తం ఉండడంతో ఆ రోజు నుంచి అమరావతిలోనే జగన్ ఉండబోతునట్లు తెలుస్తోంది. ఇకపై అక్కడి నుంచే రాజకీయ కార్యకలాపాలు చేస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సర్వేలో కూడా జగన్ కు అనుకూలంగా వచ్చాయి కాబట్టి ఏపీకి షిఫ్ట్ అవుతున్నారని అంటున్నారు. అయితే నిన్న మొన్నటి వరకు వైసీపీపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా చేసుకొని ఏపీ రాజకీయాల్లో వేలుపెడుతున్నాడు అంటూ జగన్ మోహన్ రెడ్డిని పదే పదే ఎక్కుపెట్టారు. టీడీపీ నేతలకు చెక్ పెట్టేందుకు జగన్ భావిస్తున్నారు. అందుకే లోటస్ పాండ్‌ నుంచి ఏపీకి మకాం మార్చాలని జగన్ నిర్ణయించినట్లు సమాచారం. 

Similar News