తిరుపతి జేఈఓగా జవహార్ రెడ్డి?

Update: 2019-06-02 05:17 GMT

రాష్ట్రంలో కొత్త పాలకులు రాగానే పాలనలో మార్పులు చేర్పులు ఉంటాయి. కీలక శాఖల్లో ఉండే ఉన్నాతాధికారులు మొదలుకుని జిల్లా కలెక్టర్లవరకు స్థానం చలనం జరుగుతోంది. ముఖ్యంగా టీటీడీ పాలకమండలిలో అధికారుల మార్పు ఖచ్చితంగా ఉంటుంది. కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చూపులు ఏ అధికారులపై ఉందో అనేదానిపై టీటీడీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో ముగ్గురు ఐఎఎస్ లు, ఒక ఐఎపిస్ అధికారి, ఇఓగా రాష్ర్ట కార్యదర్శి స్థాయి అధికారి ఉంటారు. తిరుమల తిరుపతిలో జేఈఓలుగా ఐఎఎస్ అధికారులు, సివిల్ అండ్ ఎస్ ఓ గా ఐపియస్ అధికారి పని చేస్తుంటారు. టిటిడిలో ఈ నాలుగు పదువులు అత్యంత కీలకం. రాష్ట్ర ప్రభుత్వం మారినప్పుడల్లా ఈ పోస్టులపై చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం టిటిడి ఇఓగా పని చేస్తున్న అనిల్ కుమార్ సింఘాల్ కేంద్ర ప్రభుత్వ సిఫారసుతో టిటిడిలోకి వచ్చారు. నాటి మిత్రపక్షం బీజేపీ కోరిక మేరకు అప్పటి సీఎం చంద్రబాబు సింఘాల్ ఈఓగా నియమించారు. కిరణ‌్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు తిరుమల జేఈవోగా వచ్చిన శ్రీనివాస రాజు ఏడేళ్ల నుంచి తన స్థానాన్ని కాపాడుకుంటు వస్తున్నారు. తాజా పరిణామాలతో శ్రీనివాస రాజుకు స్థాన చలనం తప్పేట్లుగా లేదు. ఇక తిరుపతి జేఈవో లక్ష్మీకాంతం పదవీకాలం ఈనె 30న ముగుస్తుంది. ఈ పోస్టుకు జవహర్ రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తోంది. జెఎస్వీ ప్రసాద్ గట్టి ప్రయత్నం చేస్తున్నారు. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అత్యంత సన్నిహితంగా ఉన్న జవహార్ రెడ్డికే జేఇవో పోస్టు దక్కే అవకాశం ఉంది. గతంలో రెండుసార్లు జేఇవోగా పని చేసి, కేంద్ర సర్వీసులో సెక్రటరీ హోదాలో ఉన్న ధర్మారెడ్డి కూడా రేస్ లో ఉన్నారు. వారం రోజుల్లో ఏపీలో ఐఎఎస్ లు బదిలీ కానుండడంతో టీటీడీలోని కీలక పోస్టులు ఎవరికి వరిస్తాయే అనేది తెలుస్తోంది.

Full View  

Similar News