యశోద ఆసుపత్రికి రవళి

Update: 2019-02-27 14:56 GMT

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించమని కోరితే నిరాకరించినందుకు ఓ యువకుడు ఉన్మాదిగా మారాడు. తనతో పాటు డిగ్రీ చదువుతున్న విద్యార్ధినిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రగాయాల పాలైన బాధితురాలని ప్రాథమిక చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళన కరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతోంది బాధితురాలు. 

Similar News