అల్లం టీ వల్ల ఇన్ని ప్రయోజనలండి.. మిస్ అవకండి ..!

Update: 2019-05-22 15:13 GMT

చాలా మందికి ఉదయాన్నే వేడి వేడి గొంతులో టీ  పడితే గానీ మనసు ఊరుకోదు.  టీకి అల్లం జోడిస్తే ఆరోగ్యానికి మంచిది కూడా. దీనిలో పుష్కలంగా ఉండే విటమిన్ సి, మెగ్నీషియం, మినరల్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రయాణాలలో కడుపు తిప్పే వారికి, వాంతులు అయ్యే వారికి అల్లం టీ ఇస్తే ఉపశమనం కలుగుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ తేన్పులు, జీర్ణ సమస్యలతో బాధపడేవారికి కూడా అల్లం టీ చాలా మంచిది. ముఖ్యంగా మహిళలు పీరియడ్స్ సమయంలో ఎదుర్కొనే సమస్యలకు అల్లం టీ దివ్యాఔషధంగా పనిచేస్తుంది.

మెరుగైన రక్తప్రసరణకు అల్లం టీ బాగా పనిచేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. శరీరం ఒత్తిడికి గురైనప్పుడు, మానసిక ప్రశాంతత కోసం అల్లంటీని తీసుకుంటే ఉపయోగం ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్‌ని దూరం చేసి, గుండె సంబంధిత సమస్యలు రాకుండా నివారిస్తుంది. 40 దాటితే నడుము నోప్పి, కీళ్ల నొప్పులు బాధిస్తుంటాయి. అల్లంటీని రోజూ తీసుకుంటే సమస్య చాలా వరకు తగ్గుముఖం పడుతుంది.

* సీజనల్ వ్యాధులకు అల్లం టీతో చెక్ పెట్టవచ్చు. జలుబు, ఒళ్లు నొప్పులు, జ్వరం వంటి సమస్యలకు అల్లం టీ అద్భుతంగా పనిచేస్తుంది.

* అధిక బరువుని తగ్గించే శక్తి కూడా అల్లంటీకి ఉంది. చెడు కొలెస్ట్రాల్‌ని దూరం చేసి, గుండె సంబంధిత సమస్యలు రాకుండా నివారిస్తుంది.

* శరీరం ఒత్తిడికి గురైనప్పుడు, మానసిక ప్రశాంతతకోసం అల్లంటీని తీసుకుంటే ఉపయోగం ఉంటుంది.

* మెరుగైన రక్తప్రసరణకు అల్లం టీ బాగా పనిచేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

Similar News