స్వచ్ఛ సర్వేక్షన్‌తో కలిపే సంక్రాంతి సంబరాలు: మేయర్

హైదరాబాద్ నగరాన్ని స్వచ్చ సర్వేక్షణ్ కార్యక్రమాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంచాలని నగర ప్రజలకు బొంతు రామ్మోహన్ కోరారు.

Update: 2019-01-12 12:17 GMT

హైదరాబాద్ నగరాన్ని స్వచ్చ సర్వేక్షణ్ కార్యక్రమాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంచాలని నగర ప్రజలకు బొంతు రామ్మోహన్ కోరారు. సంక్రాంతి పండగను కూడా స్వచ్చ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగానే జరుపుకోవాలని రామ్మోహన్ సూచించారు. స్వచ్చ సర్వేక్షణ్ కార్యక్రమాన్ని వినూత్నమైన రీతిలో నిర్వహించారు శేరిలింగంపల్లి జోన్ జీహెచ్ఎంసీ అధికారులు. సంక్రాంతి పండుగ శోభ ఉట్టి పడేలా ముగ్గులు, పతంగులతో నగర ప్రజలను ఉత్తేజపరిచే విధంగా నిర్వహించారు. చిన్న పిల్లల్లకు చోటా భీమ్, చుట్కీ ప్రదాన ఆకర్షణగా నిలిచాయి. స్వచ్చ సర్వేక్షణ్ లో నగరానికి మెరుగైనా ర్యాంకు రావాలని, ప్రజలందలరు ఈ కార్యక్రమం లో భాగస్వాములను చేయలన్న ఉద్దేశ్యంతో శేరిలింగంపల్లి జోన పరిధిలోని చందానగర్ పీజేఆర్ స్టేడియంలో సంక్రాంతి సంబరాలు ముగ్గుల పోటీలు కైట్ ఫెస్టివల్‌ను జీహెచ్ఎంసీ అధికారులు నిర్వహించారు. హైద్రాబాద్ నగరంలో సంక్రాంతి పండుగ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు.

Similar News