Honeymoon Murder: రాజా రఘువంశీని చంపిన ఆయుధం ఎక్కడ దొరికిందంటే?

హనీమూన్ మర్డర్: రాజా రఘువంశీ హత్యకు ఉపయోగించిన ఆయుధం స్వాధీనం – గువాహటిలో కొనుగోలు చేసినట్టు సమాచారం

Update: 2025-06-16 12:26 GMT

Honeymoon Murder: రాజా రఘువంశీని చంపిన ఆయుధం ఎక్కడ దొరికిందంటే?

Honeymoon Murder: మేఘాలయలో సంచలనం సృష్టించిన హనీమూన్ హత్యకేసులో పోలీసులు కీలక పురోగతిని సాధించారు. ఇండోర్‌కు చెందిన వ్యాపారి రాజా రఘువంశీ హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ ఆయుధాన్ని నిందితుడు గువాహటి రైల్వే స్టేషన్ సమీపంలోని మార్కెట్‌లో హత్యకు కొంతకాలం ముందు కొనుగోలు చేసినట్టు వెల్లడైంది.

ఈ హత్య రాజా రఘువంశీ తన భార్యతో కలిసి హనీమూన్ కోసం మేఘాలయ వచ్చిన సమయంలో జరిగింది. ఘటనపై సమగ్రంగా దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఆయుధం స్వాధీనం కావడం కేసు పరిణామంలో కీలక మలుపుగా మారిందని అధికారులు భావిస్తున్నారు. త్వరలోనే కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News