చల్లని కబురు

Update: 2019-05-14 02:28 GMT

హైటెంపరేచర్స్‌తో ఉక్కిరిబిక్కిరవుతున్న దేశ ప్రజలకు వాతావరణ నిపుణులు చల్లని కబురు చెప్పారు. ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ, సకాలంలోనే నైరుతి రుతుపవనాలు భారతదేశంలోకి ప్రవేశిస్తాయని అంచనా వేశారు. ఎప్పటిలాగే షెడ్యూల్ ప్రకారం జూన్ ఒకటిన నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయన్న వాతావరణ నిపుణులు జూన్ పది నాటికి దేశమంతా విస్తరిస్తాయని తెలిపారు. నైరుతి రుతుపవనాలు ఆన్ టైమ్‌లోనే రావడానికి వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయని, దేశవ్యాప్తంగా నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలు, సముద్ర వాతావరణాన్ని అధ్యయనం చేస్తున్న నిపుణులు చెబుతున్నారు. భారత వాతావరణ కేంద్రం... ఐఎండీ కూడా ఆన్ టైమ్‌ మాన్‌సూనే ఉంటుందని చల్లని కబురు చెప్పింది.

జూన్ ఒకటిన నైరుతి రుతు పవనాలు కేరళను తాకితే, జూన్ నాలుగైదు తేదీలకల్లా రాయలసీమ, తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే జూన్ 8 లేదా 9నాటికి ఆంధ్రప్రదేశ్‌లోకి కూడా విస్తరిస్తాయని తెలిపారు. ఇక జూన్ ‎పది పన్నెండుకల్లా దేశమంతా నైరుతి రుతు పవనాలు ప్రభావం చూపుతాయని అంటున్నారు.

Similar News