యజమాని కోసం శునకాల ప్రాణత్యాగం!

Update: 2019-04-19 07:09 GMT

తమ యజమాని ఇంట్లోకి వచ్చిన నాగుపాము నుంచి కుటుంబ సభ్యులను కాపాడేందుకు ప్రయత్నించిన నాలుగు శునకాలు ప్రాణత్యాగం చేసిన హృదయ విదారక ఘటన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంట్లోకి దూరిన ఒక పెద్ద నాగుపామును అడ్డుకుంటూ, నాలుగు పెంపుడు శునకాలు పోరాటం సాగించాయి. ఈ పోరాటంలో చివరికి ఆ శునకాలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన సీసీటీవీలో రికార్డయ్యింది. బిహార్‌లోని బాగల్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేసే డాక్టర్‌ పూనమ్‌ మూడు సంవత్సరాల నుంచి నాలుగు శునకాలను పెంచుకుంటున్నారు. రెక్స్‌ అని ముద్దుగా పిలుచుకునే శునకం దాని పిల్లలు క్యూటీ, బింగో, బ్లాకీ రాత్రిపూట ఇంటికి కాపలా కాస్తున్న సమయంలో ఓ నాగుపాము ఇంట్లోకి వచ్చేందుకు ప్రయత్నించింది. ఇంతలో ఆ శునకాలు నాగుపామును గమనించి దానిపై దాడికి దిగాయి. అయితే ఆ పాము కూడా ఏ మాత్రం వెనుకాడకుండా వాటిపై ప్రతిదాడికి దిగుతూనే వచ్చింది. చివరకు పాము కాటు వేయడంతో కారణంగా నాలుగు శునకాలు మరణించాయి. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమేరాల్లో రికార్డయ్యాయి. దీంతో తీవ్ర విషాదంలో ముగిగిపోయిన పూనమ్ కుటుంబం, వారి నివాస ప్రాంతంలోనే వాటి అంత్యక్రియలను జరిపించారు. 

Full View

Similar News