50 ప్రయివేటు కాలేజీలపై ఇంటర్‌ బోర్డు కొరడా

ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి దసరా సెలవుల్లో తరగతులు నిర్వహించిన 50 కాలేజీలకు ఇంటర్‌ బోర్డు జరిమానా విధించింది.

Update: 2019-10-30 05:20 GMT

ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి దసరా సెలవుల్లో తరగతులు నిర్వహించిన 50 కార్పొరేట్, ప్రైవేటు జూనియర్‌ కాలేజీలకు ఇంటర్‌ బోర్డు భారీగా జరిమానా విధించింది. ఎన్ని రోజులు కళాశాలలు నడిపించారో అన్ని రోజులు రోజుకు రూ.లక్ష చొప్పున, మరికొన్ని కళాశాలలకు రూ.7 లక్షల వరకు జరిమానా విధించింది.

ఈ సందర్భంగా ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లకు బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ నోటీసులు జారీ చేశారు. తరగతులను నిర్వహించిన కళాశాలల్లో ఎకుఉవగా శ్రీచైతన్య, నారాయణ విద్యా సంస్థలు ఉన్నట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. కాలేజీ యాజమాన్యం జరిమానా నవంబర్‌ 2 వరకు చెల్లించాలన్నారు, లేదా ఆ కళాశాలల అనుబంధ గుర్తింపు రద్దు చేస్తామన్నారు. ఆ కళాశాలల్లో చదివే విద్యార్థులను ప్రభుత్వ కాలేజీల నుంచి పరీక్షలు రాసేందుకు అనిమతిస్తామని చెప్పారు.



Tags:    

Similar News