రాష్ట్రాలకు ఈసీ కీలక ఆదేశాలు

సార్వత్రిక ఎన్నికల గడువు సమీపిస్తున్న సమయంలో ఈసీ పాలనపరమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మూడేళ్లుగా ఒకే చోటు పని చేస్తున్న ఉన్నతాధికారులను బదిలీ చేయాలంటూ ఈసీ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

Update: 2019-01-18 03:12 GMT
Election Commission

సార్వత్రిక ఎన్నికలక సీఈసీ సిద్ధమవుతోందా ? రాష్ట్రాల వారిగా పరిస్ధితులను అంచనా వేస్తోందా ? నోటిఫికేషన్ విడుదలయ్యే లోపే పాలనపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందా ? అంటే అవుననే సమాధానాలు ఢిల్లీ నిర్వచన్ భవన్ నుంచి వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై చర్యలు తీసుకోవాలంటూ సీఈసీ కోరడం ఈ పరిణామాలను మరింత బలపరుస్తోంది

సార్వత్రిక ఎన్నికల గడువు సమీపిస్తున్న సమయంలో ఈసీ పాలనపరమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మూడేళ్లుగా ఒకే చోటు పని చేస్తున్న ఉన్నతాధికారులను బదిలీ చేయాలంటూ ఈసీ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. గత స్వార్వత్రిక ఎన్నికల సమయంలో పని చేసిన చోటే ఇప్పుడు కూడా విధులు నిర్వహిస్తున్న వారిని కూడా ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలంటూ సూచన చేసింది. ఐఏఎస్‌, ఐపీఎస్‌లతో పాటు ఐజీ నుంచి ఇన్‌‌స్పెక్టర్ వరకు బదిలీకి అర్హలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఇదే సమయంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూలింగ్‌ అంటూ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్న నకిలీ వార్తలపై ఎన్నికల సంఘం చర్యలకు ఆదేశించింది. తక్షణమే దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల సంఘం అధికారులు ఢిల్లీ పోలీసులకు లేఖ రాశారు. గత వారం రోజులుగా ఫేస్‌బుక్‌ , వాట్సాప్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో ఎన్నికలు తేదీలంటూ జరుగుతున్న ప్రచారం ఫేక్ అని ఉన్నతాధికారులు తేల్చి చెప్పారు. ఊహజనిత తేదిలతో కొందరు కావాలనే ఇలాంటి ప్రచారం చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ఈసీ తెలియజేసింది. ఇలాంటి విషయంలో తాము ఏమాత్రం ఉపేక్షించేంది లేదని తేల్చి చెప్పిన ఈసీ ఇలాంటి ప్రచారాలు చేస్తున్న వారిపై విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

అధికారులను బదిలీ చేయాలంటూ ఆదేశించడం ఇదే సమయంలో నకిలీ వార్తలపై తీవ్ర స్ధాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో సార్వత్రిక ఎన్నికలకు ఈసీ సిద్ధమవుతున్నట్టు భావిస్తున్నారు. నోటిఫికేషన్ వెలువడే నాటికి అధికారుల బదిలీలు జరిగితే పాలనపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తపడవచ్చని ఈసీ భావిస్తోంది. 

Similar News