ఎన్నికల షెడ్యూల్‌కు రంగం సిద్ధం!

Update: 2019-02-22 11:19 GMT

సార్వత్రిక ఎన్నికలకు కే‌ంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. మే నెలతో గడువు ముగుస్తున్న నేపధ్యంలో వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే షెడ్యూల్ విడుదల చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దేశంలోని 29 రాష్ట్రాల నుంచి ఈసీకి నివేదికలు అందాయి. ఈ నేపధ్యంలోనే వచ్చే మార్చి 7 నుంచి 10 లోపు షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశాలున్నట్టు సమాచారం.  

Similar News