శ్రీనివాసరావుకు జ్యుడిషియల్‌ రిమాండ్‌

జగన్‌పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్‌కు విజయవాడ కోర్టు ఈ నెల 25 వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. కస్టడీ ముగియడంతో శ్రీనివాస్‌ను ఎన్‌ఐఏ అధికారులు కోర్టులో హాజరుపర్చారు.

Update: 2019-01-18 09:27 GMT

జగన్‌పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్‌కు విజయవాడ కోర్టు ఈ నెల 25 వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. కస్టడీ ముగియడంతో శ్రీనివాస్‌ను ఎన్‌ఐఏ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. విచారణ సందర్భంగా జడ్జి ప్రశ్నలకు నిందితుడు శ్రీనివాసరావు సమాధానాలు చెప్పారు. విచారణ సమయంలో ఎన్‌ఐఏ అధికారులు ఇబ్బందులు పెట్టారా అన్న ప్రశ్నకు అలాంటిదేం లేదని అన్నాడు. అలాగే తన తరపు లాయర్ చెబుతున్నట్లుగా తనకు ప్రాణహాని కూడా లేదని శ్రీనివాస్‌ స్పష్టం చేశాడు. అయితే తాను జైల్లో ఉన్న సమయంలో 22 పేజీల లేఖ రాశానని దాన్ని జైలు అధికారులు లాక్కున్నారని చెప్పారు. తనకు ఆ లేఖను తిరిగి ఇప్పించాలని శ్రీనివాస్‌రావు జడ్జీని కోరారు. తర్వాత జరిగిన విచారణలో శ్రీనివాస్‌కు విజయవాడ జైల్లో భద్రత లేదని న్యాయవాది సలీమ్‌ చెప్పగా దీనిపై ప్రభుత్వం తరపు లాయర్‌ను జడ్జీ వివరణ కోరారు. తాము విజయవాడ జైల్లో భద్రత కల్పించలేమని ప్రభుత్వ తరపు లాయర్‌ స్పష్టం చేశారు. దీంతో శ్రీనివాస్‌ను రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌కు తరలించారు. మరోవైపు సిట్‌ అధికారులు తమకు సహకరించడం లేదన్న ఎన్‌ఐఏ పిటీషన్‌పై విచారణ ఈ నెల 23 కి వాయిదా పడింది. దీనిపై కౌంటర్‌ పిటీషన్‌ దాఖలు చేయాలని సిట్‌ అధికారులను కోర్టు ఆదేశించింది. 

Similar News