పవన్ నాతో అ డైలాగ్ పది సార్లు చెప్పించాడు .. ఫిష్ వెంకట్

Update: 2019-06-07 07:21 GMT

తెలుగు సినిమా పరిశ్రమలో మంచి కమిడియన్ గా ఎదిగారు ఫిష్ వెంకట్ .. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న అయన పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించారు .. అయనతో నేను కలిసి నటించిన చిత్రం ఖుషి అని చెప్పుకొచ్చారు.. అయితే ఆ సినిమాలోని ఓ సన్నివేశం గురించి అయన మాట్లాడుతూ ఓ వైపున రౌడీ గ్యాంగ్ .. మరో వైపున పవన్. అలా మాపై ఫైట్ సీన్ ను చిత్రీకరిస్తున్నారు. ఆ సమయంలో నేను నా పక్కనున్న రౌడీతో, "అరె ఉండు బే ఏంజెయ్యాల్నో సంజైతలేదు' అనే డైలాగ్ చెప్పాను. అంతే పవన్ కల్యాణ్ గారు ఆగకుండా నవ్వుతున్నారు. ఆ డైలాగ్ నేను చెప్పిన తీరు బాగుందని, నాతో ఆ డైలాగ్ చెప్పించడం నవ్వడం. అలా నాతో ఓ పదిసార్లు ఆ డైలాగ్ చెప్పించారు. అలా పవన్ తో పరిచయం ఏర్పడిందని అన్నారు .. పవన్ రియల్ హీరో అని అంతకుమించి మనషి మనసున్నా మనషి అని చెప్పుకొచ్చాడు .. 

Tags:    

Similar News