ఏపీ బీజేపీకి ఆకుల గుడ్‌బై..రేపు జనసేనలోకి..

ఏపీలో బీజేపీకి షాక్ తగిలింది. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఆ పార్టీకి రాం రాం చెప్పేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆకుల సత్యనారాయణ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు.

Update: 2019-01-20 10:27 GMT

ఏపీలో బీజేపీకి షాక్ తగిలింది. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఆ పార్టీకి రాం రాం చెప్పేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆకుల సత్యనారాయణ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి సంబంధించిన రాజీనామా లేఖను ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు పంపారు. ఏపీ పట్ల బీజేపీ అధిష్టానం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఆకుల సత్యానారాయణ కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆకుల సత్యానారాయణ రేపు విజయవాడలో జనసేనలో చేరబోతున్నారు.  

Similar News