5 రాష్ట్రాల్లో ఓడినందుకే.. ఈబీసీ బిల్లును తెచ్చారు..

రాజ్యసభలో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. అగ్రవర్ణ కులాలకు 10శాతం రిజర్వేషన్లు కల్సించాలన్న ఈబీసీ బిల్లుపై రాజ్యసభలో జోరుగా చర్చజరుగుతుంది.

Update: 2019-01-09 10:36 GMT

రాజ్యసభలో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. అగ్రవర్ణ కులాలకు 10శాతం రిజర్వేషన్లు కల్సించాలన్న ఈబీసీ బిల్లుపై రాజ్యసభలో జోరుగా చర్చజరుగుతుంది. కాగా దీనిపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆనంద్‌ శర్మ స్పందించారు. ఇటివల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అయిదు రాష్ట్రాల్లో ఓటమి పాలైంది కాబట్టే భయపడి ఈ బిల్లును తీసుకవచ్చినట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆనంద్‌ శర్మ ఆరోపించారు. అయితే దీనిపై బీజేపీ పార్టీ సామాజిక న్యాయం కోసమే బిల్లును తిసుకొచ్చామని చెబుతున్న వాదనలు ఆనంద్ శర్మ తోసిపుచ్చారు.

అలాగే రాజ్యసభ శీతకాల సమావేశాల పొడగింపును నిరసిస్తూ విపక్ష నేతలు మండిపడ్డారు. ముందస్తు సమాచారం లేకుండా సభను ఎలా పొడగిస్తారంటూ సభలో ఆందోళనలు చేపట్టారు. పొడిగింపుపై ఏకగ్రీవ తీర్మానం లేకుండా ఎలా కొనసాగిస్తారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆనంద్‌ శర్మ ప్రశ్నించారు. రాజ్యసభలో ఇప్పటివరకూ రఫేల్‌ సహా తాము డిమాండ్‌ చేస్తున్న అంశాలపై ఇంతవరకూ చర్చ జరగలేదని అన్నారు. అయితే బీఏసీ సమావేశంలోనే రాజ్యసభ పొడిగింపుపై నిర్ణయం తీసుకున్నామని, ఈ సమావేశానికి చాలా మంది విపక్ష సభ్యులు హాజరయ్యారని డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. 

Similar News