ఏపీ ఐసెట్‌ ఫలితాలు విడుదల... చెక్ చేసుకోండి ఇలా...

Update: 2019-05-08 06:59 GMT

ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్- AP ICET 2019 ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ విజయరాజు, వెంకటేశ్వర వర్సిటీ వీసీ విడుదల చేశారు. ఎంబీఏ, ఎంసీఏలలో ప్రవేశాలకు నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షకు 48,445మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏపీ ఐసెట్ 2019 ఫలితాలను APSCHE అధికారిక వెబ్‌సైట్ sche.ap.gov.in ఓపెన్ చేసి చూడొచ్చు.

ముందుగా APSCHE అధికారిక వెబ్‌సైట్ https://sche.ap.gov.in/icet/ICET/ICET_HomePage.aspx ఓపెన్ చేయండి.

మీకు AP ICET 2019 Results బటన్ కనిపిస్తుంది. క్లిక్ చేయండి.

మీ రోల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి.

ఏపీ ఐసెట్ 2019 ఫలితాలు కనిపిస్తాయి.

Similar News