సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్‌ వర్మపై విచారణకు రంగంసిద్ధం

సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్‌ వర్మపై విచారణకు రంగం సిద్ధమవుతోంది. ప్రధాని మోడీ నేతృత్వంలోని సెలెక్ట్‌ కమిటీ అలోక్‌ వర్మను సీబీఐ డైరెక్టర్‌ పదవి నుంచి తొలగించిన కొన్ని గంటల్లోనే సీవీసీ నివేదిక ఆధారంగా ప్రాథమిక విచారణ జరిపేందుకు సీబీఐ రెడీ అయ్యింది.

Update: 2019-01-11 01:00 GMT
alok verma

సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్‌ వర్మపై విచారణకు రంగం సిద్ధమవుతోంది. ప్రధాని మోడీ నేతృత్వంలోని సెలెక్ట్‌ కమిటీ అలోక్‌ వర్మను సీబీఐ డైరెక్టర్‌ పదవి నుంచి తొలగించిన కొన్ని గంటల్లోనే సీవీసీ నివేదిక ఆధారంగా ప్రాథమిక విచారణ జరిపేందుకు సీబీఐ రెడీ అయ్యింది.

సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్‌ వర్మపై వచ్చిన 10 ఆరోపణల్లో 4 అంతగా ప్రాధాన్యత లేనివిగా తేల్చిన కేంద్ర విజిలెన్స్ కమిషన్ 2 ఆరోపణలు నిజమేనని, వాటిపై క్రమశిక్షణా చర్యలు, క్రిమినల్‌ యాక్షన్ తీసుకోవాలని సిఫార్సు చేసింది. అలాగే మరో 4 ఆరోపణలపై విచారణ జరిపించాలని సూచించింది. సీవీసీ నివేదిక ఆధారంగా ప్రిలిమినరీ విచారణకు సిద్ధమవుతోంది సీబీఐ.

ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని హైపవర్ కమిటీలో 2-1 మెజారిటీతో ఆలోక్ వర్మను సీబీఐ చీఫ్‌గా తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం పై కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. అలోక్ వర్మకు తన వాదన వినిపించేందుకు అవకాశం ఇవ్వకుండా నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకోడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద శర్మ తప్పుబట్టారు. ఆలోక్ వర్మను తొలగించాలన్న ప్రతిపాదనను మల్లికార్జున ఖర్గే వ్యతిరేకించారని గుర్తుచేశారు.

సీబీఐ విషయంలో జరుగుతున్న పరిణామాలు ఎంతో బాధాకరమని జాతీయ నాయకులు కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. తమపై అవినీతి ఆరోపణలకు సంబంధించి నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను తొలగించాలని కోరుతూ సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా, దేవేంద్ర కుమార్‌లు వేసిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు నేడు విచారించనుంది.  

Similar News