జైలు నుంచి నిమ్మగడ్డ విడుదల..సెర్బియా విడిచి వెళ్లరాదని నిమ్మగడ్డకు షరతు

Update: 2019-08-03 02:38 GMT

నిమ్మగడ్డ ప్రసాద్‌కు బెల్‌ గ్రేడ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సెర్బియా విడిచి వెళ్లరాదని నిమ్మగడ్డకు షరతు విధించారు. వాన్ పిక్ పోర్టు వ్యవహారానికి సంబంధించి రస్ అల్ ఖైమా ఫిర్యాదుతో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా ఆయనపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ జారీ చేసింది. ఈ మేరకు జులై 27న బెల్‌గ్రేడ్ విమానాశ్రయంలోనే పోలీసులు అరెస్టు చేశారు.

నిమ్మగడ్డ సెర్బియాలో విహారయాత్రకు వెళ్లగా అక్కడే ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే నిమ్మగడ్డను భారత్ తీసుకువచ్చేందుకు వైసీపీ ఎంపీలు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈమేరకు సెర్బియాతో సంప్రదింపులు జరుపాలంటూ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. నిమ్మగడ్డను సురక్షితంగా ఇండియాకు పంపించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. 

Tags:    

Similar News