నోరు జారి వాస్తవం చెప్పేసిన పాక్

Update: 2019-09-10 13:07 GMT

అబద్ధాల పాకిస్థాన్ నోటికొచ్చినట్లు అభాండాలు వేసేస్తున్నా నిజం దాచేస్తే దాగేది కాదని తేలిపోయింది. పాకిస్థాన్ తనకు తెలియకుండానే వాస్తవాలు చెప్పేస్తోంది. జెనీవాలో జరుగుతున్న ఒక సదస్సుకు హాజరైన పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ కురేషీ మీడియాతో మాట్లాడుతూ కశ్మీర్ ను భారత్ కు చెందిన ప్రాంతంగా చెప్పకనే చెప్పేశారు. కశ్మీర్ లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయంటూ కామెంట్ చేసిన కురేషీ ఆ క్రమంలో కశ్మీర్ ను భారత్ కు సంబంధించిన ప్రాంతంగా ప్రస్తావించారు.

కశ్మీర్ లో పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయని ప్రపంచానికి నమ్మ బలికే ప్రయత్నం చేస్తోంది భారత్. నిజంగానే అక్కడ జనజీవనం సాధారణంగా ఉంటే అంతర్జాతీయ మీడియాను అక్కడకి ఎందుకు అనుమతించరు? ఎన్జీవోలు, పౌర హక్కుల సంఘాలను భారత్ లోని అంతరాష్ట్రమైన జమ్మూ కశ్మీర్ లోకి ఎందుకు అనుమతించడం లేదు?అక్కడ పరిస్థితులను వారు చూసే ఆస్కారం ఎందుకివ్వడం లేదు? భారత్ వి అన్నీ అబద్ధాలే కర్ఫ్యూ ఒకసారి ఎత్తేస్తే కశ్మీర్ లో దారుణాలన్నీ ప్రపంచానికి తెలిసి వస్తాయి అని ఆయన అన్నారు.


 

Tags:    

Similar News