Putin Zelensky Trump meeting: పుతిన్–జెలెన్‌స్కీ–ట్రంప్ భేటీకి రంగం సిద్ధమవుతోందా? ఆసక్తికరంగా ట్రంప్ కామెంట్స్..!!

Putin Zelensky Trump meeting: పుతిన్–జెలెన్‌స్కీ–ట్రంప్ భేటీకి రంగం సిద్ధమవుతోందా? ఆసక్తికరంగా ట్రంప్ కామెంట్స్..!!

Update: 2025-12-29 03:29 GMT

Putin Zelensky Trump meeting: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో జరిగిన భేటీ అనంతరం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై ప్రపంచవ్యాప్తంగా ఆశలు పెరుగుతున్న వేళ.. ముగ్గురు నేతలు ఒకే వేదికపై భేటీ అయ్యే అవకాశముందా అన్న ప్రశ్నకు ట్రంప్ ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా ఉంది.

పుతిన్, జెలెన్‌స్కీతో ట్రైలేటరల్ మీటింగ్ ఉంటుందా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. సరైన సమయంలో ఆ సమావేశం కచ్చితంగా జరుగుతుందని ఆశిస్తున్నాను. రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఇదే కోరుకుంటున్నారు అని ట్రంప్ తెలిపారు. ఈ వ్యాఖ్యలు భవిష్యత్‌లో కీలకమైన చర్చలకు దారి తీసే అవకాశాన్ని సూచిస్తున్నాయి.

ఇదే సందర్భంగా ట్రంప్.. ఇటీవల తాను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో దాదాపు రెండున్నర గంటల పాటు ఫోన్‌లో మాట్లాడినట్లు వెల్లడించారు. ఆ సంభాషణలో యుద్ధ పరిస్థితులు, శాంతి ప్రయత్నాలు సహా అనేక కీలక అంశాలపై చర్చ జరిగినట్లు చెప్పారు. ఉక్రెయిన్‌తో సాగుతున్న యుద్ధాన్ని ముగించాలనే ఆలోచన రష్యాకు ఉందని కూడా ట్రంప్ పేర్కొన్నారు.

రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా యూరప్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక ప్రభావాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో అమెరికా కీలక పాత్ర పోషిస్తుందనే అంచనాలు బలపడుతున్నాయి. ట్రంప్ వ్యాఖ్యలతో మూడు దేశాల నేతల మధ్య నేరుగా చర్చలు జరిగే అవకాశాలపై కొత్త ఆశలు ఏర్పడుతున్నాయి. అయితే, ఈ ట్రైలేటరల్ భేటీ ఎప్పుడు, ఏ రూపంలో జరుగుతుందన్న విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. అయినప్పటికీ, ట్రంప్ వ్యాఖ్యలు శాంతి ప్రయత్నాలకు ఒక ముందడుగుగా అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి.

Tags:    

Similar News