Taiwan Guava Farming: లాభాలు పండిస్తున్న తైవాన్ జామ సాగు

Taiwan Guava Farming: సంప్రదాయ పంటల సాగును వీడి ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపుతున్నారు సాగుదారులు.

Update: 2022-12-28 01:30 GMT

లాభాలు పండిస్తున్న తైవాన్ జామ సాగు

Taiwan Guava Farming: సంప్రదాయ పంటల సాగును వీడి ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపుతున్నారు సాగుదారులు. పాత పంటలతో పోలిస్తే వీటిపై ఖచ్చితమైన దిగుబడులతో పాటు రాబడి కూడా అధికంగా ఉండటంతో ఈ పంటలపై దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగానే అనంతపురం జిల్లాకు చెందిన అన్నదమ్ములు ప్రయోగాత్మకంగా తమకున్న రెండు ఎకరాల పొలంలో తైవాన్ జామ సాగు చేస్తున్నారు. ఆధునిక విధానాలను అనుసరిస్తూ సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తూ నాణ్యమైన దిగుబడులతో లాభాలను అందిపుచ్చుకుంటున్నారు.

పచ్చగా కళకళలాడుతున్న ఈ జామ పంట నాటి రెండేళ‌్లవుతోంది. మొక్కనాటిని 8 నెలలకే దిగుబడి ప్రారంభమైంది. ప్రస్తుతం పంట పెట్టుబడి కూడా చేతికి అందింది. చూడటానికి జామ మొక్కలు చిన్నగా ఉన్నా ప్రతి కొమ్మకూ గుత్తులు గుత్తులుగా జామకాయలు వేలాడుతున్న ఈ తోట అనంతపుం జిల్లా వజ్రకరూరు మండలం ధర్మపురి గ్రామంలో ఉంది. ఈ గ్రామానికి చెందిన అన్నదమ్ములు నర్సారెడ్డి , మహానంద రెడ్డిలు తైవాన జామ తోటను గత రెండేళ్లుగా తమకున్న రెండుఎకరాల పొలంలో సాగు చేస్తున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా వ్యవసాయం రైతుకు భారంగా మారుతోంది. ముఖ్యంగా సంప్రదాయ పంటలు సాగు చేసే రైతులకు పంట చేతికి అందే వరకు నమ్మకం ఉండటం లేదు. అందుకే కచ్చితమైన ఆదాయం అందించే తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో ఈ పంట సాగును చేపట్టి నాణ్యమైన దిగుబడులను సొంతం చేసుకుంటున్నారు ఈ సోదరులు.

ఒక లక్షా 20 వేల రూపాయల పెట్టుబడితో జామ సాగు ప్రారంభించారు ఈ అన్నాదమ్ములు. మొక్కలు నాటిన 8 నెలలకే జామ పంట చేతికొచ్చింది. మొదటి సంవత్సరం పెట్టుబడులు పోని లక్షా 50 వేల రూపాయల వరకు ఆదాయం లభించింది. రెండవ సంవత్సరంలో 30 వేల పెట్టుబడి కాగా సుమారు 4 ఇంతలు అధికంగా ఆదాయం వచ్చిందిన రైతులు హర్షం వ్యక్తం చేశారు. మొక్క ఒకసారి నాటితే 15 ఏళ‌్ల వరకు దిగుబడి అందిస్తుందని రైతులు తెలిపారు. వారానికి మూడు సార్లు పండ్లను కోస్తామని ఒక కోతకు 20 బాక్సుల కాయ దిగుబడి లభిస్తుందన్నారు. మార్కెట్‌లో ఒక బాక్స్ ను 500 నుంచి 800 రూపాయల వరకు స్థానికంగా సరైన మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో ఉరవకొండ, అనంతపురం, బళ్లారి తదితర ప్రాంతాలకు వెళ్లి విక్రయిస్తున్నామన్నారు. మార్కెట్ చూసుకుంటే జామ సాగుతో పెద్దగా ఇబ్బంది ఏమీ లేదని ఈ రైతులు తమ అనుభవాలను తెలిపారు. ఏటా మూడు నెలలు మొక్కలకు విశ్రాంతిని అందించి కొమ్మల కత్తిరింపులు చేయాలని సూచించారు. తద్వారా నాణ్యమైన కాయ దిగుబడి లభిస్తుందన్నారు. 

Full View


Tags:    

Similar News