Telangana ICET 2025 ఫలితాలు విడుదల..! వెంటనే రిజల్ట్ చెక్ చేయండి
తెలంగాణ ICET 2025 ఫలితాలు విడుదలయ్యాయి. MBA, MCA కోర్సుల్లో ప్రవేశానికి జరిగిన పరీక్ష రిజల్ట్‌లను అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్ నంబర్‌తో తెలుసుకోండి.
Telangana ICET 2025 ఫలితాలు విడుదల..! వెంటనే రిజల్ట్ చెక్ చేయండి
తెలంగాణ రాష్ట్రంలో MBA, MCA కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఐసెట్ (ICET 2025) ఫలితాలు విడుదలయ్యాయి. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్ 8, 9 తేదీల్లో జరిగిన ఈ ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థుల ర్యాంకులు, మార్కులు అధికారిక వెబ్‌సైట్‌లో విడుదలయ్యాయి.
👇 ఫలితాలను చూసేందుకు క్లిక్ చేయండి:
🧾 ఫలితాల వివరాలు:
- మొత్తం 71,746 మంది అభ్యర్థులు ఐసెట్ కోసం దరఖాస్తు చేశారు.
- వారిలో 64,938 మంది పరీక్షకు హాజరయ్యారు
- ఇందులో 58,985 మంది (90.83%) అభ్యర్థులు అర్హత సాధించారు.
- అర్హత పొందిన వారిలో 30,989 మంది అమ్మాయిలు, 27,998 మంది అబ్బాయిలు ఉన్నారు.
📌 హాల్‌టికెట్ నంబర్‌తో ఇలా చెక్ చేయండి:
- అధికారిక వెబ్‌సైట్ https://icet.tsche.ac.in కి వెళ్లండి
- “ICET 2025 Results” లింక్‌పై క్లిక్ చేయండి
- మీ హాల్‌టికెట్ నంబర్ ఎంటర్ చేయండి
- మీ ర్యాంక్, మార్క్స్ స్క్రీన్ పై చూపబడతాయి
- ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు