NTPC Recruitment 2021: ఎన్‌టీపీసీలో 208 జాబ్స్‌.. చివరి తేదీ జూన్ 10

NTPC 2021: బీటెక్ ఫైనలియర్ లేదా పూర్తిచేసిన వారికి గుడ్‌ న్యూస్. భారత ప్రభుత్వ సంస్థ ఎన్‌టీపీసీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

Update: 2021-06-04 07:10 GMT
ఎన్‌టీపీసీ లో ఉద్యోగాలు (ఫొటో ట్విట్టర్)

NTPC Recruitment 2021: బీటెక్ ఫైనలియర్ లేదా పూర్తిచేసిన వారకి గుడ్‌ న్యూస్. భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఎన్‌టీపీసీ (నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌) సంస్థ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఈ సంస్థ పనిచేస్తుంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 280 ఇంజినీరింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ (ఈఈటీ) పోస్తులను భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టులకు గేట్‌-2021 స్కోర్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మే 21 నుంచి ప్రారంభమైంది. ఈ పోస్టులకు జూన్‌ 10 చివరితేది. పూర్తి వివరాలకు https://www.ntpc.co.in/ వెబ్‌సైట్‌ సందర్శించవచ్చు.

ఇంజినీరింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ (ఈఈటీ)లో మొత్తం 280 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో ఈ ఖాళీలున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఆయా పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌ డిగ్రీ (బీటెక్‌, బీఈ)లో కనీసం 65 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. చివరి ఏడాది లేదా చివరి సెమిస్టర్‌ చదువుతున్న విద్యార్థులు సైతం అప్లై చేసుకోవచ్చు.

అలాగే గేట్‌-2021లో స్కోర్‌ సాధించి ఉండాలి. అలాగే జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు గరిష్టంగా 27 ఏళ్లు మించకూడదు. మిగిలిన వారికి ప్రభుత్వ రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి. ఇక జీతం విషయానికి వస్తే.. నెలకు రూ.40 వేల నుంచి రూ.1,40,000 వరకు ఉండనుంది. దరఖాస్తులు మే 21, 2021 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక జూన్‌ 10, 2021లోగా దరఖాస్తులు చేసుకోవాలి.

Tags:    

Similar News