NABARD ADMIT CARD 2020: అందుబాటులోకి 'నాబార్డు' హాల్‌టికెట్లు..

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(NABARD)లో ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు చేసుకన్న అభ్యర్థులకు నాబార్డ్ పరీక్షలు నిర్వహిస్తుంది.

Update: 2020-01-27 07:06 GMT

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(NABARD)లో ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు చేసుకన్న అభ్యర్థులకు నాబార్డ్ పరీక్షలు నిర్వహిస్తుంది. ఇందుకు గాను అభ్యర్థుల హాల్ టికెట్లను నాబార్డ్ తన అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెబ్‌సైట్‌ద్వారా తమ హాల్ టికెట్లను తీసుకోవాలని తెలిపింది. ఈ సదుపాయం ఫిబ్రవరి 4వ తేదీ వరకు ఉంటుందని నాబార్డ్ తెలిపింది. ఇక ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారమే ఫిబ్రవరి 4వ తేదీన ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారని స్పష్టం చేసారు.

ఈ పరీక్ష పత్రంలో మొత్తం 120 ప్రశ్నలుంటాయని. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 120 మార్కులంటాయని తెలిపింది. అభ్యర్థులు హిందీ, ఇంగ్లిష్ బాషల్లో పరీక్ష రాయవలసి ఉంటుందన్నారు.

హాల్ టికెట్ డౌన్ లోడింగ విధానం..

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్లను తీసుకోవడానికి ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్యాలి. లాగిన్ అయ్యాక హోంపేజీలో కనిపించే 'NABARD Office Attendant Admit Card 2020' లింక్ ను క్లిక్ చేయాలి.

తరువాత అభ్యర్థులు లాగిన్ పేజీలో తమ వివరాలు నమోదు చేసి, హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. అభ్యర్థులు పరీక్ష హాలుకి హాల్‌టికెట్‌తో పాటు, ఏదైనా ఒరిజినల్ ఫొటో గుర్తింపుకార్డును వెంట తీసుకుని వెళ్లాలి.

హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి... 

Tags:    

Similar News