సెప్టెంబరు 18న ఏపీ గ్రామ సచివాలయ ఉద్యోగాల మెరిట్ జాబితా!

ఏపీలో గ్రామ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించిన అభ్యర్థుల మెరిట్ జాబితాను సెప్టెంబరు 18న విడుదల చేయనున్నట్లు మీడియా సమావేశంలో ఉన్నతాధికారులు చెప్పారు.

Update: 2019-09-10 03:25 GMT

ఏపీలో గ్రామ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించిన అభ్యర్థుల మెరిట్ జాబితాను సెప్టెంబరు 18న విడుదల చేయనున్నట్లు మీడియా సమావేశంలో ఉన్నతాధికారులు చెప్పారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్, మున్సిపల్ శాఖ కమిషనర్ విజయకుమార్ పాల్గొన్నారు.

గ్రామ సచివాలయ పరీక్షలకు సంబధించిన అభ్యర్థులు OMR షీట్ల స్కానింగ్ ప్రక్రియ త్వరలోనే ముగియనుందని తెలిపిన వారు, ఇప్పటికే 21 లక్షల షీట్లను స్కానింగ్ చేసినట్లు చెప్పారు. ఈ ప్రక్రియలు పూర్తి చేసి సెప్టెంబరు 18న మెరిట్ జాబితాను ప్రకటించనున్నట్లు తెలిపారు. అయితే గ్రామ సచివాలయ ఉద్యోగాలకు EWS రిజర్వేషన్లు వర్తించవని అధికారులు స్పష్టం చేశారు.

అభ్యర్థుల ప్రతిభ ఆధారంగానే నియామకాలు జరుగుతాయని.. పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులకే ఉద్యోగాలు దక్కుతాయని అధికారులు తెలిపారు. నియామకాలు పూర్తయిన తర్వాత మిగిలిన పోస్టులకు మరోసారి నోటిఫికేషన్ విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News