బ్రేకింగ్‌.. ఆగిపోయిన యూట్యూబ్‌

Update: 2018-10-17 03:34 GMT

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులను కలిగిన యూట్యూబ్ సేవలు నిలిచిపోవడంతో యూజర్లు ఆందోళన చెందుతున్నారు. సాంకేతిక లోపంతో ప్రపంచవ్యాప్తంగా బుధవారం యూట్యూబ్ సేవలు నిలిచిపోయాయి. ఈ సమస్య భారత్‌లో కూడా తలెత్తింది. అనేక మంది నెటిజన్లు యూట్యూబ్‌, యూట్యూబ్‌ టీవీ, యూట్యూబ్‌ మ్యూజిక్‌లో తలెత్తిన సమస్యలను సంస్థ దృష్టికి తెలియజేస్తూ రిపోర్ట్‌ చేశారు. దీంతో ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని, త్వరలో ఈ సమస్యను పరిష్కరించి, అప్‌డేట్‌ చేస్తామని యూట్యూబ్‌ సంస్థ  ట్విటర్‌లో పేర్కొంది. యూట్యూబ్‌ కంటెంట్‌ చూడాలని వెబ్‌సైట్‌లోకి వెళ్తే 500 ఇంటర్నల్‌ సర్వర్‌ ఎర్రర్‌, 503 నెట్‌వర్క్‌ ఎర్రర్‌ అని వస్తుందని నెటిజన్లు వాటికి సంబంధించిన స్క్రీన్‌ షాట్స్‌ను షేర్‌ చేస్తున్నారు. అలాగే యూజర్స్‌కు వెబ్‌సైట్‌ లాగిన్‌ కావడం లేదని పేర్కొన్నారు. 

Similar News