ఈ నెల 22న వచ్చేస్తున్న రెడ్‌మీ నోట్ 6 ప్రొ

Update: 2018-11-15 13:56 GMT

స్మార్ట్ ఫోన్ రంగంలో సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన షియోమీ ఇప్పటికే మొబైల్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది.  షియోమీ నూతన స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 6 ప్రొ ను ఈ నెల 22వ తేదీన విడుదల చేయనుంది. మరుసటి రోజు.. అంటే. ఈ నెల 23వ తేదీ నుంచి ఈ ఫోన్‌ విక్రయాలు ప్రారంభం కానున్నట్టు షియోమీ సంస్థ తెలిపింది.  షియోమీ రెడ్‌మీ నోట్ 6 ప్రొ ఫీచర్లు ఇలా ఉన్నాయి.. 6.26 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,  4జీబీ ర్యామ్, 64 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజీ, 12+5 మెగాపిక్సల్ డ్యూయల్ రియర్ కెమెరా, 20+2 ఎంపీ ఫ్రంట్ డ్యూయల్ కెమెరా, ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 363 ఎస్ఓసీ, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ సదుపాయం ఉన్నాయి. కాగా  ఈ ఫోన్ ధర రూ.15,300 ఉండే అవకాశం అవకాశమున్నట్టు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

Similar News

నేను సైతం!
StoryFour
StoryThree