లాడ్లీ మృతి.. భర్తపై అనుమానం

Update: 2018-01-27 05:57 GMT

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మరణించింది. కూకట్‌పల్లి శ్రీనిధి గార్డెన్‌లో ఐదో అంతస్థు నుంచి కిందపడి లాడ్‌ లీ మరణించింది. కుక్కతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కిందపడి మరణించిందంటూ భర్త సాయి చెబుతున్నాడు. అయితే భర్త సాయిపై మృతురాలి తండ్రి రాజేష్‌ అనుమానం వ్యక్తంచేస్తున్నాడు. భర్తే తన కూతుర్ని చంపేశాడంటూ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసుకున్న కూకట్‌పల్లి పోలీసులు సాయిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Similar News