కొడంగల్‌‌, కోస్గిలో ఉద్రిక్తత

Update: 2018-08-04 10:59 GMT

వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోస్గిలో మంత్రులు శంకుస్థాపన చేయనున్న ఆర్టీసీ బస్‌ డిపోకి తానే స్థలం కేటాయించానంటూ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పెద్దఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో తలెత్తిన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. అటు టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఇటు కాంగ్రెస్‌ కార్యకర్తలు పెద్దఎత్తున కోస్గి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, హరీశ్‌రావు, మహేందర్‌రెడ్డిలు వందవాహనాల భారీ కాన్వాయ్‌తో కొడంగల్ చేరుకోవడంతో వాతావరణం మరింత వేడెక్కింది. మరోవైపు స్థానిక ఎమ్మెల్యేగా బస్‌ డిపో శంకుస్థాపనకు హాజరుకాబోతున్న రేవంత్‌రెడ్డి కొడంగల్‌ నుంచి కోస్గికి భారీ ర్యాలీగా బయల్దేరారు. పోలీసుల సూచనను సైతం లెక్కచేయకుండా అనుచరులు, కార్యకర్తలతో రేవంత్‌ భారీ ర్యాలీ చేపట్టారు. మరోవైపు టీఆర్‌ఎస్‌ కూడా పెద్దఎత్తున జనసమీకరణ చేపట్టడంతో కొడంగల్‌, కోస్గిలో యుద్ధ వాతావరణం నెలకొంది. 
 

Similar News