విశాల్ కి ఊహించని మద్దతు..!

Update: 2017-12-12 08:53 GMT

ఆర్కేనగర్ ఉపఎన్నిక దగ్గరపడుతుండే కొద్ది రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది.. నాలుగు రోజుల కింద విశాల్ నామినేషన్ చెల్లదంటూ ఎన్నికల అధికారి, విశాల్ పోటీని తిరస్కరించారు.. దీనిపై విశాల్ కూడా గట్టిగానే స్పందిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖ కూడా రాసారు.. ఈ నేపథ్యంలో సడన్ గా మొన్న ఆ ఎన్నిక రిటర్నింగ్ అధికారిపై వేటు వేసి కొత్త అధికారికి బాధ్యతలు అప్పజెప్పింది కేంద్ర ఎన్నికల సంగం.. దీంతో తమిళనాట రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.. 

కాగా దీనిపై ప్రతిపక్షనేత  డీఎంకే నేత స్టాలిన్‌ మాట్లాడుతూ.. విశాల్‌ నామినేషన్‌ తిరస్కరణ కుట్రే అని అన్నారు. ఎన్నికల కమిషన్‌(ఈసీ) కూడా పాలక పక్షంతో కుమ్మక్కైందని ఆయన పేర్కొన్నారు. విశాల్‌ నామినేషన్‌పై అన్నాడీఎంకే దారుణాలకు పాల్పడిందని డీఎంకే నేత పేర్కొన్నారు. ఆర్కే నగర్‌ రిటర్నింగ్‌ అధికారిని తొలిగించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఆర్కేనగర్‌ ఉప ఎన్నికలో తమ పార్టీ విజయం సాధిస్తుందని డీఎంకే నేత స్టాలిన్‌ ధీమా వ్యక్తం చేశారు. అధికార పార్టీ మంత్రులే గత ఏప్రిల్‌లో రూ. 89 కోట్లు పంచి పెట్టారన్నారు. ప్రభుత్వం ఆర్కేనగర్‌ ఉప ఎన్నికను మరోసారి రద్దు చేయడానికి కుట్ర పన్నుతోందని స్టాలిన్‌ అన్నారు.

Similar News