రెబల్ అభ్యర్దులపై గులాబీ బాస్ గుర్రు

Update: 2018-11-20 05:36 GMT

టీఆర్ఎస్ తరపున రెబల్ అభ్యర్ధులుగా నామినేషన్ వేసినవారిపై గులాబీ బాస్ గుర్రుగా ఉన్నారా... ? పార్టీ లైన్ దాటి ముందుకెళ్లిన నేతలపై వేటు తప్పదా..? కేసీఆర్ నిర్ణయాన్ని దిక్కరించి పార్టీ అభ్యర్ధులకు వ్యతిరేకంగా నామినేషన్లు వేయడంపై గులాబీ పార్టీలో ఏం చర్చ నడుస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున టిక్కెట్ వస్తుందని ఆశించి బంగపడిన పలువురు రెబల్ అభ్యర్ధులుగా నామినేషన్ దాఖలు చేశారు. చివరి వరకు అవకాశం రాకపోతుందా అని వేచి చూసిన కొందరు నేతలు నామినేషన్ దాఖలు చేశారు.  సికింద్రాబాద్ కటోన్మెంట్ నియోజక వర్గం నుంచి గత ఎన్నికల్లో పోట చేసి ఓడి పోయిన గజ్జెల నగేష్  చివరి నిమిషం వరకు టికెట్టు కోసం ప్రయత్నించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్నకే  పార్టీ బీ ఫాం  ఇవ్వడంతో  నగేష్ తన అనుచరులతో కలిసి రెబల్ గా  నామినేషన్ వేసారు. 

కోదాడ టికెట్ట ఆశించిన శశిధర్ రెడ్డి , సీనియర్ నేత వేనేపల్లి చందర్ రావును కాదని టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన బొల్లం మల్లయ్య యాదవ్ కు బీ ఫాం ఇచ్చారు. శశిధర్ రెడ్డి రెబల్ గా నామినేషన్ వేసారు.  ఖైరతాబాద్ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నం చేసి భంగపడిన మన్నే గోవర్దన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. శేరిలింగంపల్లిలో గతంలో పోటీ చేసి ఓడిన శంకర్ గౌడ్ రెబల్ నామినేషన్ వేశారు. ఉప్పల్ నియోజక వర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. ఉప్పల్ టికెట్టును భేతి సుభాష్ రెడ్డికి ఇవ్వడంతో అక్కడి నుంచి నందికొండ శ్రీనివాస్ రెడ్డి రెబల్ గా నామినేషన్ వేసారు. 

నామినేషన్ల పర్వానికి ముందే అసంతృప్తి నేతలతో మంత్రి కేటీఆర్ చర్చలు జరిపారు. అయినప్పటికీ రెబల్ అభ్యర్ధులుగా నామినేషన్లు దాఖలు చేసిన వారి పట్ల  గులాబి బాస్ గుర్రుగా ఉన్నట్లుగా పార్టీలో చర్చ జరుగుతోంది. రెబల్ గా నామినేషన్ వేసిన నేతలతో చర్చించినా కూడా పార్టీ లైన్ దాటి వెళ్లారని అధిష్టానం భావిస్తోంది. 

అభ్యర్ధుల జాబితా ప్రకటించిన వెంటనే పార్టీ అభ్యర్ధులకు వ్యతిరేకంగా పని చేసిన ఎమ్మెల్సీ రాములు నాయక్, వేనేపల్లి వెంకటేశ్వర్ రావు, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిలను పార్టీ నుంచి సస్పెండే చేశారు. తాజాగా రెబల్ గా నామినేషన్లు వేసిన నేతలపై కూడా సీరియస్ గా ఉన్న పార్టీ అధిష్టానం వారిపై వేటు వేసేందుకు కూడా యేచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.  ఈనెల 22 వరకు నామినేషన్లు ఉపసంహరించుకోనట్లతే ఖచ్చింతగా పార్టీ బహిష్కరణ తప్పదని  గులాబీ పార్టీలో జోరుగా వినిపిస్తుంది. మొత్తానికి రెబల్ గా వేసినా నేతలు నామినేషన్ల ను ఉపసంహరించుకుటారా లేక గులాబి బాస్ ఆగ్రహానికి గురైవుతారా అన్నది చర్చనీయాంశంగా మారింది.

Similar News